ఆలోచన ఆనందం.. అనుభవం అద్భుతం.. అనిర్వచనీయం..
అక్షరాల నీడలో
హాయిగా నిదరోయేను మృదు భావనల అనురాగాలాపన,
అనురాగం నేనుగా..
ఆలాపన నీవుగ..
మాటల మాటులో
మౌనంగా మరుగయేను
మోహన రాగాన హృదయ స్పందన,
హృదయం నేనుగా..
నా స్పందన నీవుగా..