నా నీవు నేనుగా..

నీ నేను నీవుగా..

        మనసైన మమతానురాగాలు..

        మనవైన మధురక్షణాలు..

కాలం లిపిలో

కలల కళల వ్యాకరణంలో

   రాసిన

         ప్రణయ కావ్యాలుగా

        పరిణయ ఇతిహాసాలుగా

జగతి సంగతిలో నిలచి పోవాలి మనం

శాశ్వత సత్యమై..