ఇన్నాళ్ళలో,
ఇన్నేళ్ళలో,
ఎన్నో మారాయి..
కళ్ళలోని కలలు కవితలుగా,
మదిలోని భావాలు అక్షరాలుగా,
నిర్భయంలోని నిజాలు సంతోషాలుగా,
నవ్వులోని విషాదాలు విపరీతాలుగా,
సంధ్య చీకట్లు చెరశాలగా,
అమవస-వెన్నెల్లు పున్నమి-తిమిరాలుగా,
అభిలాషల అన్వేషణలు అంతులేని దూరాలుగా,
స్వప్నలోక నందనవనాలు ఎడారి దారులుగా,
ఇలా ఎన్నో ఎన్నెన్నో మారాయి..
ఒక్క నేను తప్ప!!