ఎవరివో నీవు..?!

ఎవరివో నీవు..?!

కలవో.. కల్పనవో..

కనుపాప కౌగిట్లో కదలాడే కధవో..

యద చాటు సందిట్లో ఊగిసలాడే వ్యధవో..

కొనగోట కదిలేటి కవితైన నదివో..

శృతిలేని మదిలోన కృతివైన జతివో..

నా జీవ ధృతిలోన మధురానుభూతివో..

నా ప్రాణ ప్రణవాన లయమైన ప్రణయ స్మృతివో..

ఎవరివో నీవు..?!

అసలెవరివో నీవు..?!