ఙ్ఞాపకం..
మధుర ఙ్ఞాపకం..
గడిచిన ప్రతి క్షణమొక మధుర ఙ్ఞాపకం..
జనన -మరణ వివరణల జీవనమొక మధుర ఙ్ఞాపకం..
ప్రణయ -ప్రళయ ప్రతీకల అనుభవమొక మధుర ఙ్ఞాపకం..
కోటి కలలు కొలువైన కావ్య నయనమొక మధుర ఙ్ఞాపకం..
క్షణ -నిరీక్షణల నీహారికలు నెలవైన నా కవితాక్షరమొక మధుర ఙ్ఞాపకం..