అందమైన కవితాధోరణిగల కవికి,

ప్రశంసలు అవసరం లేదు.

తన ఆలోచనలో ఒదిగిపోయే చిరు అక్షరం చాలు.

వేనవేల ఉషోదయాల్లా ఉద్భవించు దివ్యాస్పృత తలపుల రవికిరణాలు,

పున్నమి విను వీధుల్లో విహరించు శశి కళల సుమాక్షరాలు,


జిలిబిలి సొగసుల తుంటరి తుషార సుమధుర క్షణాలు,

కలల అలల ఊయలలో కోయిలలైన శతకొటి కావ్యాలు

కవి ఆలోచనా ప్రకృతికి జీవన ఆకృతులు..