యదేఛ్ఛగా.. స్వేఛ్ఛగా..

కలలే అలలై

వేలధారల కావ్యఝరులై..

పూల దారుల నవ్య నిధులై..

అలరించే అనామికలై..

జిలుగు వెలుగుల ఉషః వాంఛలై..

వినీల గగనంలో స్వేఛ్ఛగా విహరిస్తుంటే,

మనసేమో

మధురోహల మృదు రవళిలా,

చిద్విలాస సుమగంధాల తోరణాలతో

స్వర్గధామమైన భవిష్యత్తును

ప్రేమగా స్వాగతిస్తోంది..

క్షణమే

ఆశల రెక్కలు చాచి

మరో ప్రపంచపు సరిహద్దులు దాటాలనుంది..

యదేఛ్ఛగా..