ప్రతిఫలించింది

నా కవితాలోకం..

చిగురించిన నా స్వర్ణాక్షరాల పూదోటలో,

వాసంత సమీరమై..హేమంత తుషారమై..

ప్రతి ధ్వనించింది 

నా నవతా గీతం..

వికసించిన నా భావ స్వరాజ్యంలో,

సూర్యతేజ ప్రభాతమై.. పూర్ణ చంద్రుని ప్రకాశమై..