క్షణికమైన జీవితం కోసం ఎందుకీ ఆరాటం?

పరిచయమేలేని ప్రపంచంలోకి

జన్మబంధంతో వచ్చి

అంతులేని అనుబంధాలను పెనవేసుకుని

చివరకు జీవన రణంలో అలసిపోయి

మరణమనే పదునైన పదంతో భవబంధాలను తెంచుకుంటారు.

జీవన్మరణాల నడుమ ప్రయాణంలో

ఎన్నో పరిచయాలు, తీపి ఙ్ఞాపకాలు,

పంచుకోలేని బాధలు, వదులుకొలేని బాధ్యతలు,

మరెన్నో మౌనంగా మిగిలిపోయిన మధురానుభూతులు.

క్షణికమైన జీవితం కోసం

ఎందుకీ ఆరాటం??

ఎందుకీ పోరాటం??

అసలెందుకీ ఆర్భాటం??