ఇది నా అక్షరాంజలి..

కరిగిపోయిన కాలానికి

మరలిపొయిన మధుర క్షణానికి

ఇది నా అక్షరాంజలి..

గతం తాలూకు ఙ్ఞాపకాలకు,

భవిష్యత్తాలూకు ఊహలకు,

మిన్ను మొదలు మన్ను వరకు,

నిన్న మొదలు నేటి వరకు,

కలలు మొదలు కన్నీటి వరకు,

బాధ మొదలు ఓదార్పు వరకు,

అందరికీ ఒదిగిపోయి,

అన్నిటికీ అణిగిపోయి,

కడలెల్ల కనుల కావేరియై,

ఒడలెల్ల వెతల కార్చిచ్చులై

బ్రతుకంతా అలసి సొలసిన

మనసుకు 

ఇది నా అక్షరాంజలి..