నేస్తమా!

అంతా కలలా ఉంది.

నీ పరిచయమొక కలలా ఉంది..

నీ వెన్నెల క్రీగంటి చూపొక కలలా ఉంది..

నీ వసంత వేణుగాన స్వరమొక కలలా ఉంది..

నీ హేమంత తుషారాల చిలిపి చెలిమొక కలలా ఉంది..

నీ శరద్శశి వదన దరహాస పరిమళమొక కలలా ఉంది..

గడిచిన కాలం

చిన్ని కలలా ఉంది..