నేస్తమా! కుశలమా!!


నేస్తమా! కుశలమా!!

తొలి చూపుల తమకాలు కుశలమా?!

మధురాధరాల మధు ధారలు కుశలమా?!

మైమరపించే దరహాస దీపికలు కుశలమా?!

కవ్వించే చిలిపి చేష్టల కథకళి కుశలమా?!

మది దోచే మృదు మోహన రూపు కుశలమా?!

నా జీవన గతితో శృతి కలిసిన నీ వలపు స్మృతులు కుశలమా?!

మన ఇరువురి నడుమన విరిసిన ప్రణయ కుసుమాలు కుశలమా?!

నీ నేను నా నీవైన క్షణాల ప్రియ సౌరభాలు కుశలమా?!

నేస్తమా! కుశలమా?!

ప్రాణ బంధమా! నా నీవు కుశలమా?!