ప్రాణమా..
నీ మాట కోసం,
నీ చూపు కోసం,
నీ స్పర్శ కోసం,
రెప్పపాటైన ఎడబాటులేని నీ సాన్నిధ్యం కోసం తపిస్తూ
నా జీవితాన ప్రతి క్షణాన్ని
నీ ఊహల ఊసులకు అంకితం చేశాను.
పరిచయం మొదలు ప్రణయం వరకు
నీ తలపులలో పులకించిపొయాను..
ప్రణయం మొదలు పరిణయం వరకు
నీ జతకై పరితపించి నిను గెలిచి పరవశించాను..
పరిణయం మొదలు
నా నీవులో కలసి నీ నేనుగా మారి మన అనురాగ ప్రియరాగాలను ఆలాపిస్తున్నాను..
మన ప్రణయం మౌనగీతమైన మరుక్షణం నా ఉనికి మరణమవ్వాలని కాంక్షిస్తున్నాను..