నేనెన్నో అందమైన ఉదయాలను చూశాను..
ఇంకెన్నో అరుదైన సాయంత్రాలను చూశాను..
మరెన్నో జాబిలి వెన్నెల సొగసులను చూశాను..
ప్రతి క్షణమొక వింత అనుభవాన్ని పొందాను..
ప్రతి నిముషమొక అద్భుతానందాన్ని ఆస్వాదించాను..
ప్రతి చోటులో ప్రకృతి రమణీయతను ఆరాధించాను..
అపుడే తెలిసింది జీవితమొక అందమైన నందనవనమని!!