తొలి అరుణ కిరణాలు ఈ నేలను చేరినపుడు..


సూరీడు తెలి మంచు తెరలను దాటినపుడు..


వెన్నెల కొలనులో వాసంత సమీరాలు వీచినపుడు..


చిరుగాలికి హృద్యంగా నర్తించే తరుణీ తరువులు చిరు చినుకుల చేరువకు పులకించినపుడు..


నా ఆలోచనల మౌన తరంగాలు సుమనోహర సువర్ణాక్షరాలుగా మారినపుడు..


నా జీవిత నౌక సంజ వెలుగుల కలల తీరం చేరినపుడు..


నేను నేనుగా జన్మిస్తాను..


ప్రతిసారీ సరికొత్తగా జన్మిస్తాను..