అక్షరాంజలి

వేల తలపుల వెల్లువలో 

అనుక్షణం ఓలలాడే నా హృదయం,


మొదటిసారిగా తన అందమైన అనుభూతులను 


ఈ లోకంతో పంచుకోవడానికి 


అక్షర మల్లికల సాయం కోరింది.


తక్షణమే 


అతిసుందర దరహాసంతో 


నా కొనగోటి చెంత చేరిన 


ఆ మల్లికల సాన్నిహిత్యం, సుగంధం అనిర్వచనీయం.


అంతటి సుగంధ సౌరభాలని నాయందు స్ఫురింపజేసిన జ్ఞానశక్తికి 


ఇదే నా అక్షరాంజలి..