జీవితాన్ని ప్రేమలా ఆరాధించు నేస్తమా!!

ప్రతి క్షణాన్ని

ఆనందంగా ఆస్వాదించు నేస్తమా!!

కలలో.. కల్పనలో..

కధలో.. కవితలో..

మెరుపులో.. మేఘంలో..

ఆలోచనలో.. ఆచరణలో..

సుఖంలో.. దుఃఖంలో..

గమ్యమెరుగని గమనంలో..

ప్రతి అనుభవాన్ని అద్భుతంలా ఆస్వాదించు నేస్తమా!