అవధి లేని శూన్యానికి
ఆవలి తీరాన ఉన్న
అరుదైన మన ఉదయం కోసం
మరుగయే మలి సంధ్య వెలుగులా
నిరీక్షిస్తుంటాను ప్రాణమా..!!
కాల గమనంలో కనుమరుగవక
తీరం తాకే కడలి అలలా
నీ నను చేరరావా..!!
ఆలోచన ఆనందం.. అనుభవం అద్భుతం.. అనిర్వచనీయం..
అక్షరాల నీడలో
హాయిగా నిదరోయేను
మృదు భావనల అనురాగాలాపన,
అనురాగం నేనుగా..
ఆలాపన నీవుగ..
మాటల మాటులో
మౌనంగా మరుగయేను
మోహన రాగాన హృదయ స్పందన,
హృదయం నేనుగా..
నా స్పందన నీవుగా..